యాక్షన్ షురూ.. ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్‌ విడుదల డేట్ ఫిక్స్

by Mallepaka Hamsa |

ఈ సినిమాకు సంబంధించిన పవర్ ఫుల్ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

యాక్షన్ షురూ..  ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్‌ విడుదల డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ టాలెంట్ నాగశౌర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. ఈ సినిమాతో రామ్ దేశీనా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాకుండా, ఈ మూవీలో అక్కా తమ్ముళ్ల మధ్య ఉండే బలమైన అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించబోతున్నారని సమాచారం. శ్రీనివాస చింతలపూడి నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ద్వారా విధి హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతుండగా, సీనియర్ నటి శ్రీదేవి విజయ్ కుమార్ నాగశౌర్య సోదరిగా నటించడం ఈ సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఇప్పటికే విడుదలైన టీజర్, హరీష్ జయరాజ్ అందించిన పాటలు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఇప్పుడు అసలైన వేటను మొదలుపెట్టారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన పవర్ ఫుల్ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 6న ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా మంటలు చెలరేగుతున్నప్పటికీ భయం లేకుండా.. ఫుల్ యాక్షన్ మోడ్‌లో నాగశౌర్య కనిపించాడు. ఈ ట్రైలర్‌తో సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ ప్రియులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునే అంశాలు ఈ ఇందులో పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.

Next Story