- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Abhishek Bachchan : ఐశ్వర్యరాయ్‌తో విడాకులు.. అభిషేక్ బచ్చన్ పోస్టుతో క్లారిటీ!
ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొన్ని రోజుల నుంచి వీరు డివోర్స్ తీసుకొంటున్నారంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

దిశ, సినిమా : ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొన్ని రోజుల నుంచి వీరు డివోర్స్ తీసుకొంటున్నారంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అభిషేక్ బచ్చన్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తాజాగా అభిషేక్ బచ్చన్ కొత్త లగ్జరీ కారు కొనుగోలు చేశారు. ఆ కొత్త కారులో అభిషేక్ తన కజిన్ అగస్త్య నందా, షారుఖాన్ కుమార్తె సుహానా ఖాన్‌లను డిన్నర్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కారు నెంబర్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే బాలీవుడ్ హీరో తన కొత్త కారు నెంబర్ 5050తో ఉంటుంది. అయితే అది ఐశ్వర్యరాయ్‌కు చాలా ఇష్టమైన నెంబర్ అంట. ఐశ్వర్యరాయ్ వైట్ కలర్ మెర్సిడస్ బెంజ్ ఎస్ క్లాస్ కారు నెంబర్ కూడా 5050నే. దీని బట్టి వీరి విడాకుల రూమర్స్ అవాస్తవం అని తేలి పోయినట్లే అంటున్నారు కొందరు. అయితే ఇది ఐశ్యర్యరాయ్‌కి ఇష్టమైన నెంబర్ అనే అభిషేక్ తన కొత్త కారుకు ఆ నెంబర్ తీసుకున్నారు, వీరి మధ్య ఎలాంటి ఎడబాటు లేదు, చాలా రోజులుగా వస్తున్న విడాకుల రూమర్స్ అన్ని ఫేక్ అంటూ తెలుపుతున్నారు తమ అభిమానులు. ఇదిలా ఉంటే అభిషేక్ పుట్టినరోజు కూడా ఫిబ్రవరి 5నే. అందుకే, ఇది ఐశ్వర్యకు ఇష్టమైన నంబర్ లేదా బచ్చన్ సంతకం నంబర్ అని స్పష్టంగా తెలియాల్సి ఉంది.






