ఐశ్వర్యతో విడాకులు కన్ఫర్మ్ చేసిన అభిషేక్ బచ్చన్.. నా సొంతం అయిన వాళ్లకు అన్ని ఇచ్చేశానంటూ షాకింగ్ పోస్ట్!

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) తనయుడు అభిషేక్(Abhishek) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఐశ్వర్యతో విడాకులు కన్ఫర్మ్ చేసిన అభిషేక్ బచ్చన్.. నా సొంతం అయిన వాళ్లకు అన్ని ఇచ్చేశానంటూ షాకింగ్ పోస్ట్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) తనయుడు అభిషేక్(Abhishek) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈక్రమంలోనే.. స్టార్ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌(Aishwarya Rai)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరికి ఓ కూతురు కూడా ఉంది. వీరిద్దరు సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక ఇటీవల ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ గత కొద్ది కాలంగా విడాకులు తీసుకోబోతున్నారంటూ పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే వీరిద్దరు అధికారికంగా స్పందించకపోవడంతో ఆ పుకార్లు కాస్త ఎక్కువయ్యాయి.

ఇద్దరు కలిసి బయట కూడా ఎక్కువగా కనిపించడం లేదు. దీంతో అంతా వీరి విడాకులు నిజమే అని నమ్ముతున్నారు. ఈనేపథ్యంలోనే.. తాజాగా, అభిషేక్ బచ్చన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సంచలన పోస్ట్ పెట్టాడు. అది కాస్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ‘‘నాకు ఇష్టమైన వాళ్లకోసం అన్నీ ఇచ్చేశా. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు. కొన్ని రోజులు ఈ సమాజానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నా కోసం టైమ్ కేటాయిస్తాను. నన్ను నేను చాలా కోల్పొయా.. నా కోసం అన్నీ తెలుసుకుంటా. నన్ను నేను ప్రేమించుకోవడానికి ఇదే సరైన సమయం అనిపిస్తుంది. ఈ బ్రేక్ చాలా ముఖ్యం’’ అని రాసి ఉన్న కొటేషన్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. ఇక అది చూసిన నెటిజన్లు ఐశ్వర్య రాయ్‌తో విడాకుల గురించే ఈ పోస్ట్ పెట్టాడని చర్చించుకుంటున్నారు. ఆమెకే అన్ని ఇచ్చినట్లు చెప్తున్నాడని అంటున్నారు.

Instagram link

Next Story