- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదే నా చివరి సినిమా.. ఆ పని చేస్తూ చచ్చిపోవాలనిపిస్తుందంటూ ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ ..
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) ‘సితారే జమీన్ పర్’(Sitare Zameen Par) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) ‘సితారే జమీన్ పర్’(Sitare Zameen Par) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. RS ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ మూవీలో జెనిలియా(Genelia) హీరోయిన్‌గా నటిస్తోంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా.. జూన్ 20న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో.. ఆమిర్ ఖాన్ వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘మహాభారతం చిత్రం అనేది నా చిన్నప్పటి కల. ప్రపంచంలో ఉన్న ప్రతి భావోద్వేగం, ప్రతి మానవ సంబంధం మహాభారతంలో కనిపిస్తుంది. నేను దాన్ని సినిమా రూపంలో తీసుకురావాలని కోరుకుంటున్నాను.
అయితే ఈ మూవీ నా కెరీర్‌లో చివరి ప్రాజెక్ట్ కూడా కావొచ్చు. ఇలాంటి గొప్ప కథ తర్వాత నాకు ఇంకా ఏం చేయాలో కూడా అర్ధం కాని పరిస్థితి ఏర్పడుతుందని అనుకుంటున్నా. నాకు పని చేస్తూ చనిపోవాలని ఉంది. బహుశా ఇదే చివరి సినిమా అవుతుంది. దీన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాం. ఇప్పటి వరకు అలాంటి చిత్రం రాలేదు. దాన్ని చూపించాలంటే చాలా టైమ్ పడుతుంది. ఈ జనరేషన్‌కు నచ్చేవిధంగా తీయాలనుకుంటున్నాము’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.






