- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెక్స్ వర్కర్ల జీవితాలు కంటతడి పెట్టించాయి: Aahana S Kumra
బాలీవుడ్ నటి ఆహానా కుమ్రా కొవిడ్ ఐసోలేషన్ తన తెలివిని ప్రశ్నించినట్లు తెలిపింది.

X
దిశ, సినిమా: బాలీవుడ్ నటి ఆహానా కుమ్రా కొవిడ్ ఐసోలేషన్ తన తెలివిని ప్రశ్నించినట్లు తెలిపింది. 'ఇండియా లాక్‌డౌన్' సినిమాతో డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఆమె.. ప్రమోషన్స్‌లో భాగంగా 2020 ఏప్రిల్‌లో విధించబడిన లాక్ డౌన్‌లో ఊహించని సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పింది. అలాగే కరోనా మహమ్మారి దారుణాన్ని చాలా మంది 'మొదటి ప్రపంచ సమస్య'గా భావించారన్న ఆమె.. వలస కార్మికులు వందల కిలోమీటర్లు నడిచి ఇంటికి వెళ్లడం, ఉపాధిలేని సెక్స్ వర్కర్స్ జీవితాలు కంటతడి పెట్టించాయని వెల్లడించింది. ఇక ఆ సమయంలో తాను ఒంటరిగా ఉండటం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నప్పటికీ ఆ అనుభవం అందంగా లేదని తెలిపింది. తన జీవితంలో ఎప్పుడూ అంతలా టెన్షన్ పడలేదని.. ఇంట్లో అందరితోనూ అసాధారణంగా ప్రవర్తించానన్న ఆమె.. అప్పుడే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని రియలైజ్ అయినట్లు చెప్పింది.
- Tags
- Aahana S Kumra
Next Story






