Adipurush box office collection Day 4 : దారుణం. నాలుగో రోజు కలెక్షన్స్ చూస్తే షాక్.

by Dishanational2 |
Adipurush box office collection Day 4 : దారుణం. నాలుగో రోజు కలెక్షన్స్ చూస్తే షాక్.
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓరౌంత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, కృతిసనన్ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. ఈ మూవీ భారీ అంచనాల నడుమ జూన్ 16 విడుదలైంది. ఇక రిలీజైన మొదటి రోజు మంచి వసూల్లు రాబట్టిన మూవీ నాలుగో రోజు వసూళ్ల పరంగా కుప్పకూలి పోయింది. ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇప్పటికి మూడు రోజులు కాగా ఈ చిత్రానికి దాదాపు 330 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరికి షాక్ ఇచ్చాడు ప్రభాస్.

ఇక హిందీలో ఈ సినిమా మూడో రోజు రూ.38.2 కోట్లు రాబట్టింది. ఏ పెద్ద సినిమా అయినా బ్లాక్‌బస్టర్‌కి వారం రోజుల బాక్సాఫీస్ వసూళ్లు కూడా 55% నుండి 60% వరకు తగ్గుతాయి.కానీ ఆదిపురుష్ సినిమా మీద నార్త్ లో ఎలాంటి అంచనాలు రిలీజ్ కి ముందు ఏర్పడ్డాయో రిలీజ్ తర్వాత వాటికి డబుల్ అనిపించే రేంజ్ లో ట్రోల్స్ లాగా మారడంతో సినిమా 4వ రోజు కుప్పకూలిపోయింది.80 శాతానికి వసూల్లు పడిపోయాయి. ఇక ఏ సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 242 కోట్లు కాగా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 78.55 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిఉంది. ఇక మిగిలిన టైంలో ప్రభాస్ ఎంత వరకు కవర్ చేస్తారో చూడాలి అంటున్నారు నెటిజన్స్.

Read more : ఆదిపురుష్ సినిమాను వెంటనే బ్యాన్ చేయండి: ప్రధాని మోడీకి లేఖ

Next Story