గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ‘Adipurush’ ఫైనల్ ట్రైలర్ (వీడియో)

by Rajesh |
గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ‘Adipurush’ ఫైనల్ ట్రైలర్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం తిరుపతిలో అట్టహాసంగా జరుగుతోంది. అయితే తిరుపతి వేదికగా ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. సీతాపహరణంలో కృతి సనన్, సైఫ్ ఒదిగిపోయారు. జటాయువు వధ సీన్లను అద్భుతంగా తెరకెక్కించారు. వస్తున్న రావణ.. న్యాయం రెండు పాదాలతో.. పదితలాల అన్యాయాన్ని అణచివేయడానికి అంటూ ప్రభాస్ సంభాషణలు ఫైనల్ ట్రైలర్ లో వినిపించాయి. నా ఆగమనం అధర్మ విధ్వంసం అంటూ ప్రభాస్ పలికిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి:

బాలయ్యను భారీ దెబ్బకొట్టిన Jr. NTR ఫ్యాన్స్.. ఇంతకు తెగిస్తారని ఊహించలేదా?

నిహారికను పూర్తిగా దూరం పెట్టిన మెగా ఫ్యామిలీ.. చివరికి తండ్రి కూడా ..

Next Story