ఆది సాయికుమార్ ‘శంబాల’ సినిమా తొలి రోజు ఎన్ని కోట్లు సాధించిందంటే?

by Mallepaka Hamsa |

ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar)వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ లక్ కలిసి రావడం లేదు.

ఆది సాయికుమార్ ‘శంబాల’ సినిమా తొలి రోజు ఎన్ని కోట్లు సాధించిందంటే?
X

దిశ, సినిమా: ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar)వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ లక్ కలిసి రావడం లేదు. గత కొద్ది కాలంగా సరైన హిట్ పడటం లేదు. దాదాపు రెండేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆది ‘షణ్ముఖ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. కానీ హిట్ అందుకోలేకపోయారు. ఇక ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలన్న కసితో సస్సెన్స్ థ్రిల్లర్ ‘శంబాల’(Shambhala) మూవీతో వచ్చాడు. యుగంధర్ ముని (Yugandhar Muni)దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ సరసన అర్చనా అయ్యర్ హీరోయిన్‌గా నటించగా.. రవి వర్మ, మీసాల లక్ష్మణ్, స్వాసిక విజయ్, షీజు మీనన్, శివకార్తీక్ కీలక పాత్రలో కనిపించారు.

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌లో అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. భారీ అంచనాల మధ్య క్రిస్మస్ కానుకగా.. డిసెంబర్ 25న థియేటర్స్‌లోకి వచ్చింది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు బాగానే రాబట్టింది. ఈ విషయంపై ఆది సాయి కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మొదటి రోజు కలెక్షన్ల పరంగా అదరగొట్టిన ‘శంబాల’ బాక్సాఫీసు వద్ద రూ. 3.3కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా కోసం మరిన్ని థియేటర్స్ యాడ్ చేయబోతున్నాము, మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాధాలు అని ఆది సాయి కుమార్ తెలిపారు.

link

Next Story