సోనమ్ బజ్వాకు షాకిచ్చిన అమ్మాయి.. హీరోయిన్ వల్ల తన ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిందంటూ ఆవేదన

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-13 05:16:20  IST  )

నా మాజీ కాబోయే భర్తకు మీరంటే ప్రాణం. ఆ అభిమానం కాస్తా పిచ్చిగా మారింది. నేను కూడా చూడటానికి సోనమ్ బజ్వాలా ఉండాలని, మీలాంటి బాడీనే మెయింటైన్ చేయాలని నన్ను నిత్యం వేధించేవాడు.

సోనమ్ బజ్వాకు షాకిచ్చిన అమ్మాయి.. హీరోయిన్ వల్ల తన ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిందంటూ ఆవేదన
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ స్టార్ సోనమ్ బజ్వా గతేడాది ‘ఏక్ దీవానే కి దివానియాత్’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం సినిమాలు ఏం లేకపోవడంతో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సోనమ్ తన జీవితంలో ఎదురైన షాకింగ్ సంఘటనను పంచుకున్నారు. తన వల్ల ఒక అమ్మాయి నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందని తెలిసి తాను ఎంతగా ఆశ్చర్యపోయారో సోనమ్ వివరించారు. సోనమ్ బజ్వా ఒక ఈవెంట్‌లో పాల్గొన్నప్పుడు, ఒక అమ్మాయి నేరుగా ఆమె దగ్గరకు వచ్చి.. "మీరు సోనమ్ బజ్వా కదా? మీ వల్లే నా ఎంగేజ్‌మెంట్ బ్రేక్ అయింది" అని చెప్పిందట. ఆ మాట వినగానే సోనమ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ అమ్మాయికి సారీ చెప్పాలా లేక ఓదార్చాలా అని అర్థం కాక సోనమ్ మౌనంగా ఉండిపోయారట. అయితే ఆ తర్వాత ఆ అమ్మాయి చెప్పిన కారణం విని సోనమ్ మరింత ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఆ అమ్మాయి తన పెళ్లి ఎందుకు వద్దనుకుందో చెబుతూ.. "నా మాజీ కాబోయే భర్తకు మీరంటే ప్రాణం. ఆ అభిమానం కాస్తా పిచ్చిగా మారింది.

నేను కూడా చూడటానికి సోనమ్ బజ్వాలా ఉండాలని, మీలాంటి బాడీనే మెయింటైన్ చేయాలని నన్ను నిత్యం వేధించేవాడు. నన్ను నేనుగా కాకుండా, మరొకరిలా ఉండమని ఒత్తిడి చేసే ఆ టార్చర్‌ను నేను భరించలేకపోయాను. అందుకే అతని వైఖరి నచ్చక ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకున్నాను" అని వివరించింది. ప్రస్తుతం తాను మరొకరితో ప్రేమలో ఉన్నానని, ఆయన నన్ను ఉన్నది ఉన్నట్లుగా ప్రేమిస్తున్నారని ఆ అమ్మాయి సంతోషంగా చెప్పిందట. ఈ చేదు అనుభవం గురించి సోనమ్ స్పందిస్తూ.. ఒకరిపై అభిమానం ఉండటంలో తప్పు లేదని, కానీ అది ఎదుటివారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా లేదా వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని హితవు పలికారు. ఎవరికైనా వారి సొంత వ్యక్తిత్వం ఉంటుందని, దానిని గౌరవించాలని సోనమ్ అభిప్రాయపడ్డారు. సోనమ్ బజ్వా చెప్పిన ఈ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story