- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఐయామ్ గేమ్’ మూవీలో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా యంగ్ బ్యూటీ.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ‘సీతారామం’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను మంత్ర ముగ్దులను చేశాడు.

దిశ, సినిమా: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ‘సీతారామం’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను మంత్ర ముగ్దులను చేశాడు. ఓ వైపు నిర్మాతగా, హీరోగా వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నారు. ఇటీవల ఆయన నిర్మాణంలో వచ్చిన ‘లోకా:చాప్టర్1’ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఊహించని విధంగా విజయం సాధించింది. ఆ తర్వాత చేసిన ‘కాంత’ మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ఫోకస్ మొత్తం ‘ఐయామ్ గేమ్’(I'm game) మూవీపై పెట్టారు. నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. యాక్షన్ అండ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా రాబోతుండగా.. ఇందులో కబీర్ దుహాన్,మిస్కిన్, సంయుక్త విశ్వనాథన్, ఆంటోనీ వర్గీస్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ పాన్ ఇండియా చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌లో దుల్కర్ స్టైలిష్‌గా కనిపించి అందరిలో హైప్ పెంచేశారు.
అయితే గత కొద్ది కాలంగా ఈ మూవీలో దుల్కర్ సరసన మలయాళ బ్యూటీ కయాదు లోహర్(Kayadu Lohar) నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, ఈ విషయాన్ని నిజం చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ‘ఐయామ్ గేమ్’ మూవీలో కయాదు లోహర్ భాగం అయినట్లు వెల్లడించారు. గార్జియస్ బ్యూటీ జాయిన్ కావడం థ్రిల్లింగ్‌గా ఉందంటూ.. ఫైరింగ్ పోస్టర్‌ను షేర్ చేశారు. కాగా.. ఇటీవల ‘డ్రాగన్’ సూపర్ హిట్ అందుకున్న కయాదులోహర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ప్రజెంట్ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోల సరసన చాన్స్ దక్కించుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉంది. తెలుగులో విశ్వక్‌సేన్‌కు జోడీగా ‘ఫంకీ’లో నటిస్తోంది. అలాగే నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’లోనూ నటించనున్నట్లు సమాచారం.






