- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధర్మానికి కాపలా కాసే యోధుడు.. ‘హైంధవ’ నుంచి వైల్డ్ పోస్టర్ రిలీజ్
వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) మరోసారి పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు.

దిశ, సినిమా: వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) మరోసారి పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల ‘భైరవం’తో హిట్ అందుకున్న ఆయన, ‘కిష్కింధపురి’ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా వెనుకడుగు వేయకుండా పాన్ ఇండియా మూవీ ‘హైంధవ’(HAINDAVA)పై పూర్తి ఫోకస్ పెట్టాడు. యాక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి లుధీర్ బైరెడ్డి(Ludhir Byreddy) దర్శకత్వం వహిస్తుండగా, మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
అయితే ఈ సినిమా ఒక పురాతన దాశావతార దేవాలయాన్ని రక్షించడం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఇందులో హీరో ఈ దేవాలయాన్ని విధ్వంసం నుండి కాపాడటానికి ప్రయత్నిస్తాడు, ఇది పౌరాణిక నేపథ్యంతో కూడిన థ్రిల్లర్‌గా రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘హైంధవ’ నుంచి జనవరి 3న అదిరిపోయే అప్డేట్ రాబోతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వైల్డ్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ధర్మాన్ని రక్షించేందుకు హింసతో యోధుడు హైంధవ డ్యూటీ స్టార్ట్” అనే క్యాప్షన్‌తో పాటు, రక్తంతో తడిచిన గొడ్డలితో తన చేతిని కోసుకుంటున్న హీరో లుక్‌ను చూపించారు. అయితే ముఖాన్ని మాత్రం రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేయడం ఆసక్తిని రెట్టింపు చేసింది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా యాక్షన్, మైథాలజీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో హై వోల్టేజ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోందన్న అంచనాలున్నాయి.






