- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకదేశంపై యుద్ధం జరుగుతోంది.. నేను ఎవరికీ సపోర్ట్ చేయడం లేదు: తనికెళ్ల భరణి
అన్ని మతాలను, అన్ని వర్గాల ప్రజలను సమానంగా గౌరవిస్తానని స్పష్టం చేశారు.

దిశ, సినిమా: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా కొందరు యూట్యూబర్లు కేవలం వ్యూస్ కోసం సెలబ్రిటీల ఆస్తుల గురించి, వారి వ్యక్తిత్వం గురించి థంబ్‌నెయిల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఇటువంటి చేదు అనుభవం సీనియర్ నటుడు తనికెళ్ల భరణికి ఎదురైంది. గత కొన్ని రోజులుగా యూట్యూబ్‌లో తనికెళ్ల భరణి ఆస్తులకు సంబంధించిన వీడియోలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. తనికెళ్ల భరణి (Tanikella Bharani)ఆస్తులు చూస్తే మైండ్ పోవాల్సిందే అనే రేంజ్‌లో ప్రచారం మొదలైంది. ఆయన ఇంటి ముందు అరడజను ఖరీదైన కార్లు ఉన్నాయని, కోట్లలో ఆస్తులు ఉన్నాయని కొందరు వార్తలు సృష్టించారు. తాజాగా, ఈ పుకార్లపై తనికెళ్ల భరణి ఒక వీడియో ద్వారా చాలా సున్నితంగా, అంతే స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. ‘‘నా ఆస్తులు చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే అని రాశారు, కానీ ఆ వార్తలు చూసి నేనే షాక్ అయ్యాను’’ అని ఆయన నవ్వుతూ వ్యాఖ్యానించారు.
తన ఇంటి ముందు కార్లు ఉన్నాయని చూపిస్తున్న దృశ్యాల్లో వాస్తవం లేదని, ఆ వార్తలు చూసి తన కుటుంబ సభ్యులంతా కలిసి నవ్వుకున్నామని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల నేపథ్యంలో, తాను ఏదో ఒక దేశానికి లేదా ఒక మతానికి మద్దతు ఇస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను అన్ని మతాలను, అన్ని వర్గాల ప్రజలను సమానంగా గౌరవిస్తానని స్పష్టం చేశారు. ఈ రకమైన తప్పుడు వార్తలు తనను నమ్మే మిత్రులను, శ్రేయోభిలాషులను బాధకు గురిచేస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, వాటిని ఎంకరేజ్ చేయవద్దని ఆయన కోరారు.సెలబ్రిటీల గురించి రాసేటప్పుడు కనీస బాధ్యత ఉండాలని తనికెళ్ల భరణి మాటలు గుర్తుచేస్తున్నాయి. ఎంతో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న తనలాంటి నటుడిపై ఇలాంటి గాలి వార్తలు రాయడం సరికాదనేది ఆయన ఉద్దేశం.






