సామాన్యుడిలా హోటల్‌కు వెళ్లి టిఫిన్ చేసిన హీరో వెంకటేశ్ (వీడియో)

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-12-17 12:58:53  IST  )

హీరో వెంకటేశ్ సామాన్యుడిలా మారిపోయారు. ఒంటరిగా వెళ్లి ఓ హోటల్‌లో టిఫిన్ చేశారు. అక్కడ ఉన్న వారితో మాటామంతీ కలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సామాన్యుడిలా హోటల్‌కు వెళ్లి టిఫిన్ చేసిన హీరో వెంకటేశ్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : హీరో వెంకటేశ్ సామాన్యుడిలా మారిపోయారు. ఒంటరిగా వెళ్లి ఓ హోటల్‌లో టిఫిన్ చేశారు. అక్కడ ఉన్న వారితో మాటామంతీ కలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయవాడలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న 95 సినిమా ‘సైంధవ’. ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్లో, వెంకటేశ్ కెరీర్‌లోనే అత్యధిక భారీ బడ్జెట్‌లో హైరేంజ్ యాక్షన్ హంగులతో తెరకెక్కించారు ఈ మూవీని.

‘సైంధవ’ ప్రమోషన్‌లో భాగంగా ఇవాళ విజయవాడ వెళ్లిన చిత్ర బృందం ముందుగా కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంది. హీరో వెంకటేశ్, డైరెక్టర్ శైలేష్, శ్రద్ద శ్రీనాథ్‌లను అర్చకులు ఆశీర్వదించారు. అనంతరం వెంకటేశ్ ఒక్కరే నడుచుకుంటూ ‘ఏంటి బాబాయ్ సంగతులు’ హోటల్‌కు వెళ్లారు. అక్కడ టిఫిన్ చేస్తున్న వారితో మాట్లాడారు. వాళ్లతో కలిసి ఇడ్లీ ఆరగించారు. సామాన్యుడిలా స్టార్ హీరో స్థానికుల మధ్యకు వచ్చి టిఫిన్ చేయడంతో అక్కడి వారంతా షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత తేరుకుని ఆయనతో కరచలనం చేస్తూ సెల్ఫీలకు ఫోజులు ఇచ్చారు.

Next Story