Renu Desai: ఏడేళ్ల వయసుకే కఠిన నిర్ణయం.. సెన్సేషనల్ వీడియోతో షాకిచ్చిన రేణు దేశాయ్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-07 04:44:16  IST  )

పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్(Renu Desai) నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకుంటోంది.

Renu Desai: ఏడేళ్ల వయసుకే కఠిన నిర్ణయం.. సెన్సేషనల్ వీడియోతో షాకిచ్చిన రేణు దేశాయ్
X

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్(Renu Desai) నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకుంటోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన ఒక వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాను సుమారు ఏడేళ్ల వయసున్నప్పుడే మాంసాహారాన్ని పూర్తిగా వదిలేశానని, దానికి కారణం చిన్నతనంలో తన కళ్లముందే జరిగిన ఒక హృదయ విదారక సంఘటన అని ఆమె వెల్లడించింది. ఒక మేక పిల్లను బలి ఇవ్వడం చూసిన ఆ క్షణం నుంచి మాంసం ముట్టకూడదని కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించింది. తన తండ్రి మాంసాహారం తిన్నప్పటికీ, తన తల్లి కఠినమైన శాకాహారి అని.. కనీసం ఉల్లి, వెల్లుల్లి కూడా ముట్టేవారు కాదని రేణు దేశాయ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది.

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాలతో బిజీగా ఉన్న రేణు దేశాయ్, జంతు సంరక్షణ విషయంలోనూ ఎప్పుడూ ముందుంటుంది. ‘‘మా అమ్మ మమ్మల్ని ఎప్పుడూ బలవంతం చేయలేదు.. కానీ ఆనాడు మేక పిల్ల బలిని చూసిన తర్వాత నా మనసు మారిపోయింది’’ అని ఆమె చెప్పుకొచ్చింది ఈ వీడియోను షేర్ చేసిన రేణు దేశాయ్, నెగటివ్ కామెంట్లకు తావు లేకుండా కామెంట్ బాక్స్‌ను ఆఫ్ చేయడం విశేషం. జంతువుల పట్ల ఆమెకు ఉన్న ప్రేమను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు అయితే షాక్‌కు గురవుతున్నారు. చాలా ఏళ్లుగా తాను శాకాహారిగానే కొనసాగుతున్నానని, ఈ నిర్ణయం తన జీవితంలో తీసుకున్న ఉత్తమమైన నిర్ణయాల్లో ఒకటి అని ఆమె ఈ వీడియో ద్వారా స్పష్టం చేసింది.

నోరా ఫతేహి, తమన్నాతో పోలికలా? ‘ధురంధర్’ బ్యూటీ షాకింగ్ రియాక్షన్!

Next Story