నోరా ఫతేహి, తమన్నాతో పోలికలా? ‘ధురంధర్’ బ్యూటీ షాకింగ్ రియాక్షన్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-07 04:41:07  IST  )

బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆయేషా ఖాన్(Ayesha Khan) ‘ధురంధర్’లో ‘షరారత్’ సాంగ్‌తో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

నోరా ఫతేహి, తమన్నాతో పోలికలా? ‘ధురంధర్’ బ్యూటీ షాకింగ్ రియాక్షన్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆయేషా ఖాన్ ‘ధురంధర్’లో ‘షరారత్’ సాంగ్‌తో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. వరుస అవకాశాలు అందుకుంటోంది. తాజాగా, ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ, తనను స్టార్ డాన్సర్లు నోరా ఫతేహి(Nora Fatehi), తమన్నా భాటియా(Tamannaah Bhatia)తో పోల్చడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో తనను వారిద్దరితో పోలుస్తూ వస్తున్న రీల్స్‌ను తాను చూశానని, అయితే వారితో తనను పోల్చుకోవడం అస్సలు నచ్చదని క్లారిటీ ఇచ్చింది. ‘‘నోరా, తమన్నా అద్భుతమైన మహిళలు. నోరా స్టేజ్ పెర్ఫార్మెన్స్, ఎనర్జీ చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది.. తను చేసేది నేను ఎప్పటికీ చేయలేను’’ అంటూ నోరాపై తనకున్న గౌరవాన్ని చాటుకుంది.

ఇక తమన్నా గురించి మాట్లాడుతూ.. ‘‘తమన్నా ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉంది. ఎన్నో గొప్ప పనులు చేస్తోంది. ‘ఆజ్ కీ రాత్’ సాంగ్‌లో ఆమెను చూసి నేను ఫిదా అయిపోయాను. నేను ఇండస్ట్రీకి కొత్త, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది’’ అని ఆయేషా చెప్పుకొచ్చింది. ఎవరైనా తనను వారితో పోల్చితే తనకు సంతోషం కలగదని, వారి జర్నీ వేరని స్పష్టం చేసింది. అదే విధంగా తన కో-స్టార్ క్రిస్టల్ డిసౌజాతో మనస్పర్థలు ఉన్నాయనే వార్తలను కూడా ఆమె కొట్టిపారేసింది. తామిద్దరం అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటామని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఈ సందర్భంగా ఆయేషా ఖాన్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

బాలీవుడ్ మరో ఆఫర్ కొట్టేసిన నేషనల్ క్రష్.. రెండోసారి ఆ హీరోతో రొమాన్స్..?

Next Story