- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రష్మిక కోరిక తీర్చిన టాలీవుడ్ హీరో..!
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా ( Rashmika Mandanna ) గురించి తెలియని వారు ఉండరు. అతి తక్కువ కాలంలోనే

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా ( Rashmika Mandanna ) గురించి తెలియని వారు ఉండరు. అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా కొనసాగడమే కాకుండా... అటు బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా దున్నేస్తోంది. అవకాశం వచ్చిన ప్రతి సినిమాను సద్వినియోగం చేసుకొని.. అగ్ర హీరోయిన్గా కొనసాగుతోంది రష్మిక మందాన. అయితే అలాంటి హీరోయిన్ రష్మిక మందన్నా కోరికను హీరో అల్లు అర్జున్ (Allu Arjun) తీర్చినట్లు సోషల్ మీడియాలో కొంతమంది ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ చేస్తున్నారు.
అదేంటి అల్లు అర్జున్ కోరిక తీర్చడం ఏంటని అనుకుంటున్నారా ? ఇది రియల్ లైఫ్ లో కాదు. పుష్ప 2 సినిమాలో ( Pushpa 2) అల్లు అర్జున్ అలాగే రష్మిక మందన్నా భార్య, భర్తలుగా నటిస్తారని సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో... ముఖ్యమంత్రితో ఫోటో కావాలని అల్లు అర్జున్ ను హీరోయిన్ రష్మిక మందన్నా కోరుతుంది. దాని కోసం ఆ సినిమాలో అల్లు అర్జున్... ఎన్నో సాహసాలు చేస్తాడు. అయితే.. ఆ సినిమాలోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఏకంగా ముఖ్యమంత్రితో ఫోటో దిగి... హీరోయిన్ రష్మిక కోరిక తీర్చడానికి కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా గద్దర్ అవార్డ్స్ ( Gaddar Awards) ఫంక్షన్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy) చేతుల మీదుగా గద్దర్ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫోటో కూడా దిగారు. ఆయన ముందే డైలాగ్ చెప్పి రచ్చ చేశారు అల్లు అర్జున్. దీంతో పుష్ప సినిమాలో రష్మిక కోరిన కోరికను.. రియల్ లైఫ్ లో అల్లు అర్జున్ తీర్చేశాడని కొన్ని వీడియోలు వైరల్ చేస్తున్నారు.
instagramme link






