అజిత్ కుమార్ ‘AK-64’ సినిమాలో టాలీవుడ్ హీరోయిన్.. హాట్ టాపిక్‌గా మారిన పోస్ట్!

by Mallepaka Hamsa |

అజిత్ కుమార్ (Ajith Kumar)భాషతో సంబంధం లేకుండా ఒక్క ఏడాదిలో రెండు మూడు చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు.

అజిత్ కుమార్ ‘AK-64’ సినిమాలో టాలీవుడ్ హీరోయిన్.. హాట్ టాపిక్‌గా మారిన పోస్ట్!
X

దిశ, సినిమా: అజిత్ కుమార్ (Ajith Kumar)భాషతో సంబంధం లేకుండా ఒక్క ఏడాదిలో రెండు మూడు చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇటీవల ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీతో అలరించిన అజిత్ కుమార్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు కొంత బ్రేక్ తీసుకున్నాడు. తన పర్సనల్ ఇంట్రెస్ట్ అయిన రేసింగ్‌పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఇక త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ షూట్‌లో పాల్గొనబోతున్నారట. ‘AK-64’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా ఆదిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran)దర్శకత్వంలో తెరకెక్కనుండగా.. రోమియో పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన వార్తలెన్నో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇందులో టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ‘AK-64’ సినిమాకు సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో మరో బ్యూటీ జాయిన్ కాబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఆమె మరెవరో కాదు.. యంగ్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా పేరు బలంగా వినిపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అజిత్ కుమార్‌తో కలిసి రెజీనా ‘విదాముయర్చి’ సినిమాలో నటించింది. ఇక ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది.

ఇక ఇప్పుడు మరోసారి అజిత్ కుమార్‌తో నటిస్తున్నట్లు వార్తలు వస్తుండటంతో రెజీనా పాత్రపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. అయితే ఇందులో రెజీనా హీరోయిన్‌గా నటిస్తుందా? అేక కథకు కీలకమైన మరో పాత్రలో కనిపిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమవుతున్నట్లు డైరెక్టర్ స్పష్టం చేశారు. విభిన్న పాత్రలు, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో కూడిన పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం కోసం సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

Next Story