ట్రిపుల్ రోల్ లో తెలుగు హీరో.. ఇక ఫ్యాన్స్ కు పండగే ?

by Veldandi saikiran |
ట్రిపుల్ రోల్ లో తెలుగు హీరో.. ఇక ఫ్యాన్స్ కు పండగే ?
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ( Tollywood) ఇండస్ట్రీ నుంచి బిగ్ న్యూస్ బయటకు వచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో.... ట్రిపుల్ రోల్ ( Triple role ) చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో నెగిటివ్ రోల్ తో పాటు... రెండు పాజిటివ్ రోల్స్ ఉంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో... ముగ్గురు హీరోయిన్లు కూడా ఈ సినిమాలో ఉంటారని... టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ ప్రచారం జోరుగా సాగుతోంది.

అయితే ఇంతకీ ఆ హీరో ఎవరు..? ఏ దర్శకునితో ఆ సినిమా తీస్తున్నాడు అనేది మాత్రం బయటకు రాలేదు. కానీ దీనికి సంబంధించిన ఓ పోస్టు వైరల్ కావడంతో... అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎగబడి కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో... ట్రిపుల్ రోల్ చేసే మొనగాడు అల్లు అర్జున్ ఒక్కడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అల్లు అర్జున్, అట్లీ ( Allu Arjun -Atlee) దర్శకత్వంలో కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉంది. దాదాపు 1000 కోట్లతో ఈ సినిమా... తీస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేయబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. నెగిటివ్ రోల్ తో పాటు రెండు పాజిటివ్ రోల్స్ ఉంటాయట. ఇదే విషయాన్ని అల్లు అర్జున్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ... ప్రచారం అయితే సాగుతోంది.



Next Story

Most Viewed