సంయుక్త మీనన్ చేతిపై వింత గుర్తు.. హాట్ టాపిక్‌గా మారిన ఫొటోలు!

by Mallepaka Hamsa |

మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ (Samyuktha Menon)ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.

సంయుక్త మీనన్ చేతిపై వింత గుర్తు.. హాట్ టాపిక్‌గా మారిన ఫొటోలు!
X

దిశ, సినిమా: మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ (Samyuktha Menon)ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇటీవల 'అఖండ-2', 'నారి నారి నడుమ మురారి' వంటి చిత్రాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్న సంయుక్త, ఇప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ సరసన ‘స్వయంభు’ (Swayambhu)అనే ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈక్రమంలో.. తాజాగా ‘స్వయంభు’ టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో అందరి కళ్ళు సంయుక్త మీనన్ చేతిపైనే పడ్డాయి. సంయుక్త చేతికి స్పష్టంగా ఒక గాయం కనిపిస్తుండటంతో అది కాస్తా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ గాయం ఎలా అయ్యింది? షూటింగ్ సమయంలో జరిగిందా? అంటూ ఆరా తీస్తున్నారు. ఇక ఆమె చేతిపై ఉన్న ఆ గుర్తును చూసి కొందరు అది "ఎవరో కొరికిన మరకలా ఉందే?" అని కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు ఏకంగా ఆమె వ్యక్తిగత జీవితాన్ని లాగుతున్నారు. "బాయ్‌ఫ్రెండ్ అలా చేసి ఉంటాడా?" అని కొందరు నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘స్వయంభు’ సినిమా కోసం కత్తి సాము, యుద్ధ విద్యల్లో కఠినమైన శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏదైనా ప్రమాదవశాత్తూ గాయం అయ్యి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, ప్రమోషన్ల జోరులో ఉన్న సంయుక్త చేతి గాయం ఇప్పుడు సినిమా టీజర్ కంటే ఎక్కువగా హాట్ టాపిక్‌గా మారింది.

Next Story