తారక్-హృతిక్‌ల ‘వార్-2’ నుంచి సాలిడ్ అప్‌డేట్.. ఆ స్పెషల్ డే నాడే రిలీజ్ చేస్తారట?

by Disha Web Desk 10 |
తారక్-హృతిక్‌ల ‘వార్-2’ నుంచి సాలిడ్ అప్‌డేట్.. ఆ స్పెషల్ డే నాడే రిలీజ్ చేస్తారట?
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల అప్ కమింగ్ మూవీ ‘వార్-2’కు సంబంధించిన బిగ్ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాతోనే తారక్ బాలీవుడ్‌ అరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీ షూటింగ్ కోసం సరికొత్త ప్రాంతాలు వెతికి పెట్టారని, ఈ నవంబర్‌లోనే సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లు ఇటీవల మేకర్స్ ఓ సమావేశంలో తెలిపారు. అయితే తాజాగా ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ రిలీజ్‌కు సంబంధించిన డేట్ కూడా నెట్టింట వైరల్ అవుతుంది. యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న మూవీకి సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించనుండగా 2025 రిపబ్లిక్‌డే నాడు సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే షూటింగ్‌ షెడ్యూల్స్‌ సిద్ధం చేస్తున్నారని, కొరటాల శివ ‘దేవర’ కంప్లీట్ అవగానే ఎన్టీఆర్‌ ‘వార్‌-2’ షూటింగ్‌లో జాయిన్‌ కాబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Read More: ఐదు సంవత్సరాల నుంచి వెయిట్ చేసినందుకు చేసి చూపించా అంటూ విజయ్ దేవరకొండ ఆసక్తికర పోస్ట్


Next Story

Most Viewed