నాని, మృణాల్‌పై సినీ క్రిటిక్ ట్వీట్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

by Disha Web Desk 7 |
నాని, మృణాల్‌పై సినీ క్రిటిక్ ట్వీట్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా : టాలీవుడ్ నటుడు నాని, యంగ్ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌కు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. శౌర్యువ్ దర్శకత్వంలో వస్తున్న నాని 30వ చిత్రం ‘హాయ్ నాన్న’లో మృణాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ డిసెంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో వేగంగా షూటింగ్ జరుగుతుండగా.. నటీనటులు ఎక్కువ సమయం సెట్‌లోనే గడుపుతున్నారట.

ఈ క్రమంలోనే నాని, మృణాల్ మధ్య క్లోజ్ అయ్యారని బాలీవుడ్ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశమైంది. అయితే ప్రతి సెలబ్రిటీపై ఏదో ఒక అశ్లీల, వ్యక్తిగత ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా ఉమైర్ సంధు ట్వీట్స్ చేస్తుండటంపై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. పని కట్టుకుని మరీ అసత్య ఆరోపణలు, ఏమాత్రం ఆధారాలు లేని ట్వీట్స్ చేసి తన అభిమాన నటీనటులను ఉమైర్ సంధు బజారున పడేస్తున్నాడని ఫైర్ అవుతున్నారు.



Next Story

Most Viewed