- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిత్రాంగద సింగ్‌కు షాక్.. దయచేసి ఆ మెసేజ్‌లను పట్టించుకోకండి అంటూ ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ చిత్రాంగద సింగ్‌కు ఊహించని షాక్ తగిలింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె.. సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు.

దిశ, సినిమా: బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ చిత్రాంగద సింగ్‌కు ఊహించని షాక్ తగిలింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె.. సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. తన అధికారిక ఎక్స్ ఖాతాను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారని ఆమె స్వయంగా వెల్లడించడంతో సోషల్ మీడియాలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల ఖాతాలను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు, ఇప్పుడు చిత్రాంగద ఖాతాను కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా, ఈ విషయాన్ని చిత్రాంగద ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది.. "హలో అందరికీ నా ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. దయచేసి ఆ ఖాతా నుంచి వచ్చే ఎలాంటి లింకులను క్లిక్ చేయవద్దు. దయచేసి మెసేజ్‌లను పట్టించుకోకండి. మేము దానిని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నాం" అని చిత్రాంగద కోరారు.
సాధారణంగా ఇలాంటి హ్యాకింగ్ ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం లేదా వ్యక్తిగత డేటాను దొంగిలించడం జరుగుతుంది కాబట్టి, ఫ్యాన్స్ అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఇక చిత్రాంగద సింగ్ సినిమాల విషయానికొస్తే.. ఆమె తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మాతృభూమి’ మూవీలో ఆమె హీరోయిన్‌గా కనిపించనున్నారు. 2020లో గల్వాన్ లోయలో మన భారత సైనికులు చైనా బలగాలతో జరిపిన వీరోచిత పోరాటం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సల్మాన్ ఖాన్ తెలంగాణ ముద్దుబిడ్డ, వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పాత్రను పోషిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం దేశభక్తిని తట్టిలేపే యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది.
సల్మాన్- చిత్రాంగద కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉండబోతోందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని సీన్లు మూవీ మేకర్స్‌ను సంతృప్తి పరచని కారణంగా రీషూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో విడుదల ఇంకాస్త ఆలస్యం అవుతుందని టాక్. ఎక్కడా రాజీపడకుండా.. షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది వరకు విడుదల చేసే ప్లాన్‌లో చిత్రబృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా? అని సల్మాన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






