Kayadu Lohar: ట్రెడిషనల్ లుక్‌లో అందానికి అసలైన నిర్వచనం చెప్పిన బ్యూటీ

by Pulgam srinivas |

తెలుపు చీరలో మెరిసిన కయాదు లోహర్… ట్రెడిషనల్ లుక్‌లో అలరిస్తోంది.

Kayadu Lohar: ట్రెడిషనల్ లుక్‌లో అందానికి అసలైన నిర్వచనం చెప్పిన బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్ : మోస్ట్ బ్యూటిఫుల్ నటి కాయాదు లోహర్ ఇప్పటివరకు మలయాళ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన అల్లూరి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.




అయితే ఈ మూవీ విజయం సాధించకపోవడంతో ఆ చిత్రంతో ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. కొంతకాలం క్రితం ఈ బ్యూటీ తమిళంలో రూపొందిన డ్రాగన్ సినిమాలో నటించింది. ఈ మూవీ తెలుగులో కూడా విడుదలై మంచి విజయం సాధించడంతో ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది.



ప్రస్తుతం కాయాదుకి టాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కుతున్నాయి. కొంతకాలం క్రితం ఈ యువ నటి ఫంకీ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం ఈమె నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందనున్న ది ప్యారడైజ్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.




ఈ యంగ్ హీరోయిన్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటుంది. ఇటీవల ఈ నటికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలలో కయాదు లోహర్ తెలుపు రంగు చీర కట్టుకుని, అందుకు తగిన బ్లౌజ్ ధరించి సంప్రదాయబద్ధమైన లుక్‌లో కనిపించింది.




చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్, చేతులకు గాజులు, నుదుటిపై అందమైన బొట్టు పెట్టుకుని, కురులను వెనక్కు వేసుకుని వివిధ యాంగిల్స్‌లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో కయాదు లోహర్ ఎంతో కలగా మెరిసిపోతూ కనిపించడంతో, ఆమెకు సంబంధించిన ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story