‘లెనిన్’సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. అదిరిపోయిన అఖిల్, భాగ్యశ్రీ పోస్టర్!

by Mallepaka Hamsa |

ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన మొదటి పాట మంచి రెస్పాన్స్ అందుకోగా, ఇప్పుడు మేకర్స్ రెండో పాటను సిద్ధం చేశారు.

‘లెనిన్’సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. అదిరిపోయిన అఖిల్, భాగ్యశ్రీ పోస్టర్!
X

దిశ, సినిమా: అక్కినేని హీరో అఖిల్ చాలా కాలం తర్వాత తన సరికొత్త చిత్రం ‘లెనిన్’ తో వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. మురళీ కిషోర్ దర్శకత్వంలో ఒక ఊర మాస్ రూరల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా, ఈచిత్రం నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన మొదటి పాట మంచి రెస్పాన్స్ అందుకోగా, ఇప్పుడు మేకర్స్ రెండో పాటను సిద్ధం చేశారు. ‘యెట్టా యెట్టా’ అని సాగే ఈ రెండో పాటను ఏప్రిల్ 16న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా.. విడుదల చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో అఖిల్- హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే‌ను గట్టిగా హగ్ చేసుకుని, గోదారి గట్టున రొమాంటిక్ మూడ్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోతుందని అర్థమవుతోంది. కాగా.. ఈ సినిమాలో మొదట శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. కొంత షూటింగ్ కూడా పూర్తయిన తర్వాత ఆమెను తొలగించి, ఆ స్థానంలో ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్న విషయం తెలిసిందే.. దీనికి గల కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ, భాగ్యశ్రీ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత గ్లామర్ తోడైందని చెప్పొచ్చు.

ఇక విడుదల విషయానికొస్తే.. నిజానికి ఈ సినిమా మే 1న విడుదల కావాల్సి ఉంది. కానీ ఏప్రిల్ 30న రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ విడుదల అవుతుండటంతో, బాక్సాఫీస్ వద్ద అనవసర పోటీ ఎందుకని భావించి మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ‘లెనిన్’ చిత్రం జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ స్పష్టం చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత అఖిల్ చేస్తున్న ఈ ప్రయోగం ఆయన కెరీర్‌కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. ‘లెనిన్’కోసం అక్కినేని వారసుడు తెగ కష్టపడిపోతున్నాడని టాక్. చూడాలి మరీ ఎంతవరకు మెప్పిస్తాడో? హిట్ కొడతాడో లేక మళ్లీ ఫ్లాప్‌తో ఇండస్ట్రీకే దూరం అవుతాడో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story