- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కష్టాల్లో విశ్రాంతినిచ్చే జోలపాట.. ‘బైసన్’ థర్డ్ సింగిల్ అప్డేట్
చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్(Dhruv) హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న చిత్రం ‘బైసన్’(Bison).

దిశ, సినిమా: చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్(Dhruv) హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న చిత్రం ‘బైసన్’(Bison). మారి సెల్వరాజ్ (Mari Selvaraj)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పశుపతి, కలైయరసన్, హరికృష్ణన్, అళగమ్ పెరుమాళ్, అరువి మదన్, రెజిషా విజయన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీని అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, దర్శకుడు పా రంజిత్‌కు చెందిన నీలం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తుండగా.. దీపావళి కానుకగా విడుదల కాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
ఈక్రమంలో.. ‘బైసన్’ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసిన మూవీ మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన మూడో పాట రాబోతున్నట్లు తెలుపుతూ.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రెజిషా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఇందులోని థర్డ్ సింగిల్ ‘చీనీ కళ్ళు’ అనే సాగే పాట సెప్టెంబర్ 23న సాయంత్రం రాబోతున్నట్లు తెలుపుతూ.. కష్టాల్లో ఎవరికైనా విశ్రాంతినిచ్చే జోలపాట! కాలమాదన్ మీరు ఒక అడుగు వెనక్కి వేసి కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే జీవించడం ఎంత కష్టమో అతనికి తెలుసు’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక అది చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.






