రేవింగ్ పార్టీ నెంబర్ మీ ముందుకు వస్తోంది.. ‘వర్జిన్ బాయ్స్’ నుంచి రొమాంటిక్ పోస్టర్‌ను వదిలిన చిత్రబృందం

by Mallepaka Hamsa |

గీతానంద్, మిత్రా శర్మ(Mitra Sharma) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వర్జిన్ బాయ్స్’(Virgin Boys).

రేవింగ్ పార్టీ నెంబర్ మీ ముందుకు వస్తోంది.. ‘వర్జిన్ బాయ్స్’ నుంచి రొమాంటిక్ పోస్టర్‌ను వదిలిన చిత్రబృందం
X

దిశ, సినిమా: గీతానంద్, మిత్రా శర్మ(Mitra Sharma) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వర్జిన్ బాయ్స్’(Virgin Boys). దయానంద్(Dayanand) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజ్ గురు ఫిలిమ్స్ బ్యానర్‌పై రాజా దరపునేని నిర్మిస్తున్నారు. ఇందులో సుజిత్ కుమార్, రోనీత్, జెన్నిఫర్, అన్షు, అభిలాష్, బబ్లు, శ్రీహాన్ వంటి వారు కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పోస్టర్లు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ ట్వీట్ చేశారు. ‘వర్జిన్ బాయ్స్’ సెకండ్ సింగిల్ డమ్ డిగా డమ్ అని సాగే పాట జూన్ 25న ప్రసాద్ ల్యాబ్స్‌లో ఉదయం 10గంటలకు లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఓ రొమాంటిక్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇందులో ఓ జంట గట్టిగా హత్తుకుని కనిపించగా.. మరో జంట పడుకుని లిప్ కిచ్చ ఇచ్చుకుంటున్నారు. ఇక వాటిని చూసిన ఒక అమ్మాయి చెవులు, కళ్లు మూసుకుని కనిపిస్తుండగా.. ఓ అబ్బాయి ఆమె పక్కన నిల్చొని ఉన్నాడు. ఇక ఈ పోస్ట్‌కు చిత్రబృందం‘‘రేవింగ్ పార్టీ నంబర్ మీ ముందుకు వస్తోంది.. సిద్ధంగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేశారు.

Twitter link

Next Story