ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్‌కు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్.. ఆ స్పెషల్ రోజున సర్‌ప్రైజ్!

by Mallepaka Hamsa |

ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్‌కు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్.. ఆ స్పెషల్ రోజున సర్‌ప్రైజ్!
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అరవింద సమేత’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా, ఎన్టీఆర్ నటనలోని కొత్త కోణాన్ని చూపించారు. ఇప్పుడు మళ్ళీ ఈ క్రేజీ కాంబోలో ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతుందనే వార్తలు గత కొద్ది కాలంగా సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, ఫిల్మ్ నగర్ వర్గాల్లో మాత్రం ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి ‘గాడ్స్ ఆఫ్ వార్’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు టాక్. టైటిల్ వింటుంటేనే ఇది ఒక భారీ యాక్షన్ డ్రామా అని అర్థమవుతోంది. త్రివిక్రమ్ తన మార్క్ డైలాగులతో పాటు, ఈసారి విజువల్ ఎఫెక్ట్స్‌కు కూడా పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చే సమయం ఆసన్నమైంది. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందట. ఈ గ్లింప్స్ కోసం అత్యున్నత ప్రమాణాలతో కూడిన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, ఎన్టీఆర్, త్రివిక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే ఈ వీడియోను రిలీజ్ చేయనున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చాలా కాలం తర్వాత త్రివిక్రమ్ మళ్ళీ ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేస్తుండటం, అది కూడా హై-టెక్నికల్ వాల్యూస్‌తో కూడిన సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ‘గాడ్స్ ఆఫ్ వార్’ పేరుతో హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. పుట్టినరోజు నాడు రాబోయే ఆ అదిరిపోయే సర్ ప్రైజ్ కోసం నందమూరి అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Next Story