ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోలు ఫొటో వైరల్.. పవన్ లుక్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్

by Disha Web Desk 6 |
ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోలు ఫొటో వైరల్.. పవన్ లుక్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి గురించి ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే వీరిద్దరు ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని ఒక్కటయ్యారు. వీరిద్దరి పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీలో సందడి చేస్తున్నారు. అయితే వీరి పెళ్లి పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి నిత్యం వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

తాజాగా, చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా ఓ సూపర్ పిక్‌ను అభిమానులతో పంచుకున్నారు. వరుణ్-లావణ్య పెళ్లి తర్వాత మెగా హీరోలంగా కలిసి తీసుకున్న పిక్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇక ఇందులో చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ కనిపించారు. అందరు గ్రాండ్‌ డ్రెస్‌లో కనిపిస్తే.. పవన్ కల్యాణ్ మాత్రం సింపుల్‌ లుక్‌లో కనిపించి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే ‘‘ వారు ప్రేమతో నిండిన కొత్త జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు. స్టార్ కపుల్‌కు శుభాకాంక్షలు’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed