- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. హిట్ కోసం మాస్ ఎలివేషన్స్ పక్కన పెట్టి భారీ రిస్క్ తీసుకోబోతున్న స్టార్స్.. సక్సెస్ దక్కేనా?
ఇప్పటివరకు కేవలం భారీ యాక్షన్ సీక్వెన్సులు, ఊరమాస్ ఎలివేషన్స్, మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మన స్టార్ హీరోలు.. ఇప్పుడు రూట్ మార్చారు.

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక సరికొత్త ట్రెండ్ మొదలైందనడంలో సందేహమే లేదు. ఇప్పటివరకు కేవలం భారీ యాక్షన్ సీక్వెన్సులు, ఊరమాస్ ఎలివేషన్స్, మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మన స్టార్ హీరోలు.. ఇప్పుడు రూట్ మార్చారు. కమర్షియల్ హంగులను పక్కన పెట్టి, ప్రేక్షకుల గుండెల్ని తాకే కంప్లీట్ ఎమోషనల్ డ్రామాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. కథలో బలమైన విలువలూ, భావోద్వేగాలూ ఉంటేనే థియేటర్లకు జనాలు వస్తున్నారనే విషయాన్ని గ్రహించి, మేకర్స్ కూడా వింటేజ్ లుక్స్, బలమైన కంటెంట్‌తో కథలను డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్స్‌ను గమనిస్తే ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘Mega158’ లో తండ్రి-కూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్ సెంటిమెంట్ ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఇక ఈ మూవీకి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తుండగా.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం కాగా.. షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్లు టాక్.
అలాగే, ఎప్పుడూ పవర్‌ఫుల్ డైలాగ్స్, యాక్షన్‌తో అలరించే నందమూరి బాలకృష్ణ.. తన ‘NBK112’ చిత్రంలో ఒక డిఫరెంట్ మెసేజ్ ఓరియంటెడ్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీనిని గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. ఇక మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ కూడా హై-వోల్టేజ్ ఎమోషనల్ రైడ్‌గా తెరకెక్కుతుండటం విశేషం. ఇక కోలీవుడ్ స్టార్ సూర్య తెలుగులో వెంకీ అట్లూరీ దర్శకత్వంలో చేస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా ప్యూర్ ఫ్యామిలీ ఎమోషన్స్‌ను నమ్ముకుని బరిలోకి దిగుతున్నారు. కమర్షియల్ ఫార్ములా కంటే ఎమోషనల్ డ్రామా పండితే బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ వస్తుందని, కలెక్షన్ల వర్షం కురుస్తుందని హీరోలు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ, ఇలాంటి కథలను ఎంచుకుంటూ వారు రిస్క్ తీసుకునేందుకు వెనకాడటం లేదు. యాక్షన్‌తో పాటు ప్రేక్షకుడి మనసుకు హత్తుకునే సెంటిమెంట్ ఉంటేనే సినిమా క్లాసిక్‌గా నిలిచిపోతుందనే ఈ కొత్త ట్రెండ్‌గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఇంత రిస్క్ చేస్తున్నందుకైనా సక్సెస్ వస్తుందా? లేక బోల్తా పడతాయా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.






