నారా కుటుంబంలోకి కొత్త అతిథి.. వైరల్‌గా మారిన సిరి బేబీ బంప్ వీడియోలు

by Mallepaka Hamsa |

నారా రోహిత్ తన భార్య గర్భవతి అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ, తాజాగా జరిగిన సిరి శ్రీమంతం వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

నారా కుటుంబంలోకి కొత్త అతిథి.. వైరల్‌గా మారిన సిరి బేబీ బంప్ వీడియోలు
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ ఇంట్లో త్వరలోనే పసిపాప అడుగులు పడబోతున్నాయి. సినిమాల విషయంలో ఎంతో సెలెక్టివ్‌గా ఉండే రోహిత్, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టానికి చేరుకున్నారు. ఆయన త్వరలోనే తండ్రి కాబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నారా రోహిత్, నటి సిరి ‘ప్రతినిధి-2’ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి, గత ఏడాది అక్టోబర్ నెలలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు ఐదు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన వీరి పెళ్లి వేడుకలు అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచాయి. ఇప్పుడు పెళ్లై ఏడాది కాకముందే ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతుండటంతో నారా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నారా రోహిత్ తన భార్య గర్భవతి అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ, తాజాగా జరిగిన సిరి శ్రీమంతం వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ వీడియోలలో సిరి ఎంతో సంప్రదాయబద్ధంగా పట్టుచీరలో, గర్భవతిగా కళకళలాడుతూ కనిపిస్తుండటంతో ఈ వార్త నిజమేనని స్పష్టమైంది. భార్య బాగోగులు చూసుకుంటూ రోహిత్ ఎంతో సంతోషంగా కనిపిస్తున్న ఈ దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో నెటిజన్లు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు కాగా.. నారా రోహిత్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎంతో బిజీగా ఉన్నారు. గత ఏడాది ‘భైరవం’ వంటి మాస్ హిట్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. ఆ తర్వాత ‘సుందరకాండ’ అనే సినిమా చేసినప్పటికీ అది ఆశించినంత విజయం సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు ఒక భారీ ప్రాజెక్టులో ఆయన భాగమయ్యారు. విక్టరీ వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో రోహిత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు భార్యకు తోడుగా ఉంటూ తన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తున్నారు.

Next Story