- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త అధ్యాయం ప్రారంభం.. హిట్ సినిమా సీక్వెల్‌పై బిగ్ అప్డేట్ ఇచ్చిన దుల్కర్ సల్మాన్
మలయాళ యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘లోకా: చాప్టర్1’.

దిశ, సినిమా: మలయాళ యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘లోకా: చాప్టర్1’. దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డులు బ్రేక్ చేస్తుంది. మొదటి షో నుంచి సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ అందరి ప్రశంసలు పొందుతోంది. ఆగస్టు 28న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ఈక్రమంలో.. తాజాగా, దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ‘లోకా: చాప్టర్ 1 చంద్ర’ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా ఓ స్పెషల్ వీడియోను కూడా షేర్ చేశాడు. ‘‘పురాణాలకు అతీతంగా. ఇతిహాసాలకు అతీతంగా.
కొత్త అధ్యాయం ప్రారంభం. ‘లోకా చాప్టర్-2’ రాబోతుంది’’ అనే క్యాప్షన్ జత చేశాడు. ఇక రెండో పార్ట్ కూడా డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో రాబోతుండగా.. వెఫరర్ బ్యానర్‌పై దుల్కర్ నిర్మిస్తున్నారు. ఇక దుల్కర్ విడుదల చేసిన వీడియోలో టోవినో కలిసి చిల్ అవుతూ కనిపించాడు. ఇక ఇందులో టోవినో థామస్, దుల్కర్ మైఖెల్, చార్లీగా గెస్ట్ రోల్స్ చేయబోతున్నట్లు సమాచారం. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే విడుదల తేదీ, నటీనటులకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. దీంతో నెటిజన్లు సూపర్ ఎగ్జైటెడ్ అంటూ ఫైర్ ఎమోజీలు పెడుతున్నారు.






