- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరోయిన్లు జాగ్రత్తలు తీసుకోవాలంటూ నెటిజన్ పోస్ట్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన చిన్మయి
హీరోయిన్లకు రోజుకో చేదు అనుభవం ఎదురవుతోంది.

దిశ, సినిమా: హీరోయిన్లకు రోజుకో చేదు అనుభవం ఎదురవుతోంది. ఇటీవల నిధి అగర్వాల్ (Nidhi Agarwal)లూలూ మాల్‌కి వెళ్లగా.. అభిమానుల అత్యుత్సాహం కారణంగా.. ఆమెకు తీవ్ర ఇబ్బంది కలిగింది. ఇక ఈ సంఘటన మరవకముందే.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురవడం అందరినీ కలచివేస్తోంది. ఓ షాప్ ప్రారంభోత్వవ కార్యక్రమానికి వెళ్లిన సమంత(Samantha)ను జనాలు చుట్టుముట్టారు. అంతేకాకుండా కొందరు ఆమెను తాకేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ అడ్డుకున్నప్పటికీ సమంత దగ్గరకు వచ్చారు. కష్టం అయినప్పటికీ సెక్యూరిటీ వారు జనాలను కంట్రోల్ చేసి సమంతను క్షేమంగా కారు ఎక్కించి పంపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా మండిపడుతున్నారు.
మరికొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తుంటే.. కొంతమంది మాత్రం జనాల్లోకి వచ్చినప్పుడు హీరోయిన్లు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఓ నెటిజన్ ‘‘ఇది పౌర స్పృహ లేకపోవడాన్ని ప్రతిబింబిస్తుంది. నటి, ఆమె బృందం మరింత మెరుగైన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని పోస్ట్ పెట్టాడు. ఇక అది చూసిన చిన్మయి(Chinmayi) ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘ఆమె టీమ్ సభ్యుడు ఆర్యతో సహా మొత్తం, తమ ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడుతున్నారు. కనీసం అతనికి చాలా గాయాలైనా తగిలి ఉండాలి. ప్రాథమిక పౌర మర్యాద తెలియని జన సమూహాన్ని నియంత్రించడం ఒక నటి పని కాదు’’ అని కౌంటర్ వేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.






