Samanthaను రవితేజ సినిమాలో విలన్‌తో పోల్చిన నెటిజన్!

by Disha Web Desk 9 |
Samanthaను రవితేజ సినిమాలో విలన్‌తో పోల్చిన నెటిజన్!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది సమంత. ఈ హీరోయిన్ మయోసైటిస్ వ్యాధితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒక ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం. అయితే హీరో అక్కినేని నాగచైతన్యతో విడిపోయాక ఈ భామ విషయంలో ఏ తప్పు జరిగినా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తాజాగా సామ్‌ను బాగా టార్గెట్ చేసి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. సమంత.. విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

కాగా, ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పాటలు నెట్టింట బాగా వైరల్ అవుతోన్నాయి. ఇందులోని టైటిల్ సాంగ్‌లోని సమంత లుక్స్‌ను మ్యాచ్ చేస్తూ దుబాబ్ శీనులో విలన్ లేడీ గెటప్ వేసిన లుక్స్‌ను అటాచ్ చేస్తూ మీమ్స్ క్రియేట్ చేసి తను అచ్చం అలాగే ఉందంటూ తాజాగా నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై సామ్ ఫ్యాన్స్ ఫైర్ అవ్వగా మరికొంతమంది హా కరెక్టే బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘Bhola Shankar’ ప్రీరిలీజ్‌కు తేదీ ఖరారు

Next Story

Most Viewed