తప్పు జరిగిపోయింది.. చేతులు జోడించి క్షమాపణలు కోరిన సింగర్ మంగ్లీ!

by Mallepaka Hamsa |

ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను.

తప్పు జరిగిపోయింది.. చేతులు జోడించి క్షమాపణలు కోరిన సింగర్ మంగ్లీ!
X

దిశ, సినిమా: ఫోక్ సింగర్ మంగ్లీ తన విలక్షణమైన గొంతుతో ఎన్నో సూపర్ హిట్ సాంగులు పాడి ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఆమె పాడిన ఒక పాట ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. కన్నడ యాక్షన్ డ్రామా ‘కేడీ: ది డెవిల్’ (KD: The Devil) సినిమా కోసం మంగ్లీ ‘సర్కె చునార్ తేరి సర్కే’ అనే పాటను పాడింది. ఈ పాటలో ఉపయోగించిన కొన్ని పదాలు అసభ్యకరంగా, బూతు పదాలను పోలి ఉన్నాయంటూ నెటిజన్ల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.ఈ పాట విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియా వేదికగా మంగ్లీపై నెటిజన్లు మండిపడ్డారు. ఒక బాధ్యతాయుతమైన గాయనిగా ఇలాంటి పదాలున్న పాటలను ఎలా పాడుతారని చాలామంది ప్రశ్నించారు.

ఈ వివాదం రోజురోజుకూ ముదురుతుండటంతో, పరిస్థితి తీవ్రతను గమనించిన మంగ్లీ తక్షణమే స్పందించింది.జరిగిన పొరపాటుపై మంగ్లీ సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు కోరింది. "ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. ప్రజల సెంటిమెంట్లను మేము ఎప్పుడూ గౌరవిస్తాం. అందుకే ఈ వివాదాస్పద పాటను అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ,మ్యూజిక్ యాప్స్ నుండి వెంటనే తొలగించాము" అని ఆమె స్పష్టం చేసింది. పాటను తొలగించి, క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. అయితే, పాటలు పాడేటప్పుడు పదాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు మంగ్లీని హెచ్చరిస్తున్నారు.

Next Story