‘పెద్ది’ కోసం భారీ రెమ్యునరేషన్.. వామ్మో ఒక్క పాట కోసం శృతి హాసన్ అన్ని కోట్లు తీసుకుందా?

by Mallepaka Hamsa |

ఈ స్పెషల్ సాంగ్ కోసం కేవలం 3 నుంచి 4 రోజులు షూటింగ్ చేస్తే సరిపోతుంది. తక్కువ రోజుల్లోనే హీరోయిన్ రెమ్యునరేషన్ కంటే ఎక్కువ సంపాదిస్తుండటంతో నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

‘పెద్ది’ కోసం భారీ రెమ్యునరేషన్.. వామ్మో ఒక్క పాట కోసం శృతి హాసన్ అన్ని కోట్లు తీసుకుందా?
X

దిశ, సినిమా: కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ పేరు మార్మోగిపోతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’లో ఆమె స్పెషల్ సాంగ్ చేస్తుందనే వార్త ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. షూటింగ్ లొకేషన్ నుంచి కొన్ని వీడియోలు లీక్ అవ్వడంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం ఏమిటంటే.. ఈ ఒక్క పాట కోసం శృతి అందుకున్న భారీ పారితోషికం. సాధారణంగా శృతి హాసన్ ఒక సినిమాకు హీరోయిన్‌గా చేస్తే దాదాపు రూ. 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. కానీ ‘పెద్ది’ సినిమాలో కేవలం ఒకే ఒక్క పాట కోసం ఆమె ఏకంగా రూ. 3.5 కోట్లు డిమాండ్ చేసిందని, మేకర్స్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. హీరోయిన్‌గా చేస్తే దాదాపు 30 నుంచి 40 రోజుల పాటు కాల్ షీట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ స్పెషల్ సాంగ్ కోసం కేవలం 3 నుంచి 4 రోజులు షూటింగ్ చేస్తే సరిపోతుంది. తక్కువ రోజుల్లోనే హీరోయిన్ రెమ్యునరేషన్ కంటే ఎక్కువ సంపాదిస్తుండటంతో నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ కోసం భారీగా ఛార్జ్ చేస్తున్నారు. ‘స్త్రీ 2’లో తమన్నా, ‘కూలీ’ సినిమాలో పూజా హెగ్డే ఒక్కో పాటకు రూ. 3 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు శృతి హాసన్ వారిని కూడా దాటేసి రూ. 3.5 కోట్లు తీసుకోవడం సినీ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. రామ్ చరణ్ సరసన గతంలో ‘ఎవడు’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శృతి, చాలా కాలం తర్వాత మళ్ళీ ఆయన పక్కన మాస్ స్టెప్పులు వేయబోతోంది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఆయన కంపోజ్ చేసిన ఊర మాస్ ట్యూన్ కు రామ్ చరణ్ గ్రేస్, శృతి హాసన్ ఎనర్జీ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని చిత్రబృందం నమ్మకంగా ఉంది. ఈ పాట సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని టాక్. తక్కువ పనికే ఎక్కువ లాభం ఉండటంతో శృతి హాసన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

Next Story