- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌లో శివరాజ్ కుమార్ భారీ ప్రాజెక్ట్.. బుల్లెట్లు-గద పోస్టర్‌తోనే హైప్ క్రియేట్
బిజీ షెడ్యూల్ మధ్య కూడా శివరాజ్ కుమార్ మరో కొత్త ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు. కోలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి శరవణన్ దర్శకత్వం వహించబోతున్నారు.

దిశ, సినిమా: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (శివన్న) వయసు పెరుగుతున్నా ఉత్సాహం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఆయన దక్షిణాదిలో మోస్ట్ బిజీ యాక్టర్లలో ఒకరిగా మారిపోయారు. కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ సినిమాల్లోనూ క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ తన హవా కొనసాగిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’మూవీలో శివన్న ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది కాకుండా, ఆయన చేతిలో ప్రస్తుతం గుమ్మడి నర్సయ్య, ఉత్తరకాండ, 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ వంటి వైవిధ్యమైన చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి భిన్నమైన కథాంశాలతో రూపొందుతుండటం విశేషం. ఇంత బిజీ షెడ్యూల్ మధ్య కూడా శివరాజ్ కుమార్ మరో కొత్త ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు. కోలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి శరవణన్ దర్శకత్వం వహించబోతున్నారు.
టిజి త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హై టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా, విడుదలైన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కోసం వాడిన డిజైన్ చాలా వెరైటీగా ఉంది. ఒకవైపు బుల్లెట్లు, మరోవైపు సింహం గుర్తు ఉన్న గదను పోస్టర్‌లో చూపించి సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ఈ పోస్టర్ చూస్తుంటే శివన్న ఇందులో ఒక పవర్‌ఫుల్ యాక్షన్ హీరోగా కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుందని వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. అంచనాలను రెట్టింపు చేస్తోంది. అలాగే ఎలాంటి పాత్రలో శివన్న కనిపించబోతున్నారనే ఆసక్తి నెలకొంది.






