స్టూడియో గ్రీన్ సంస్థకు బిగ్ షాక్.. హాట్ టాపిక్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్

by Mallepaka Hamsa |

తదుపరి నోటీసు వచ్చే వరకు ఆ ఖాతా నుంచి వచ్చే ఎలాంటి మెసేజ్‌లను కానీ, లింకులను కానీ నమ్మకండి.

స్టూడియో గ్రీన్ సంస్థకు బిగ్ షాక్..  హాట్ టాపిక్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్
X

దిశ, సినిమా: ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ అవ్వడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం అకౌంట్‌ను హ్యాక్ చేయడమే కాకుండా, అందులో వింత వింత పోస్టులు పెడుతూ హ్యాకర్లు సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ఏదైనా అకౌంట్ హ్యాక్ అయితే క్రిప్టో కరెన్సీ లేదా ప్రకటనల గురించి పోస్టులు వస్తుంటాయి. కానీ, స్టూడియో గ్రీన్ విషయంలో హ్యాకర్లు రూటు మార్చారు. వివిధ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల గురించి, వివాదాస్పద రాజకీయ అంశాల గురించి వరుసగా పోస్టులు పెడుతున్నారు. దీంతో ఫాలోవర్లు కన్ఫ్యూజ్ అయ్యి, ఒక నిర్మాణ సంస్థ ఇలాంటి పోస్టులు పెట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నా. ఇక అది గమనించిన మూవీ మేకర్స్ వెంటనే అలర్ట్ అయి దీనిపై ఇన్‌స్టాలో ఓ ప్రకటన విడుదల చేశారు.

"మా సంస్థకు రాజకీయాలకు అసలు సంబంధమే లేదు, ఇదంతా హ్యాకర్ల పని" అని స్పష్టంగా తేల్చి చెప్పారు. హ్యాకర్లు కేవలం పోస్టులు పెట్టడమే కాకుండా, కొన్ని అనుమానాస్పద లింకులను కూడా షేర్ చేసే అవకాశం ఉందని స్టూడియో గ్రీన్ హెచ్చరించింది. ఆ లింకులను క్లిక్ చేస్తే యూజర్ల వ్యక్తిగత సమాచారం కూడా చోరీ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే, "తదుపరి నోటీసు వచ్చే వరకు ఆ ఖాతా నుంచి వచ్చే ఎలాంటి మెసేజ్‌లను కానీ, లింకులను కానీ నమ్మకండి" అని సంస్థ కోరారు. ప్రస్తుతం ట్విట్టర్ సపోర్ట్ టీమ్‌తో కలిసి అకౌంట్‌ను తిరిగి పొందడానికి స్టూడియో గ్రీన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగి అకౌంట్‌ను సేఫ్ చేయడానికి పని చేస్తోంది. కంగువ వంటి భారీ చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ ఖాతా హ్యాక్ అవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Next Story