- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలంతో ప్రతిధ్వనించే ప్రేమకథ.. ‘బ్యూటీ’ మూవీ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్..
‘ఆయ్’తో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న అంకిత్ కొయ్య(Ankit Koyya) లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్యూటీ’(Beauty).

దిశ, సినిమా: ‘ఆయ్’తో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న అంకిత్ కొయ్య(Ankit Koyya) లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్యూటీ’(Beauty). వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నీలఖి పత్ర (neelakhi patra)హీరోయిన్‌గా కనిపించబోతోంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనింగ్ చిత్రాన్ని వానరా సెల్యూలాయిడ్, మారుతీ టీం ప్రొడక్షన్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై అడిదాల విజయ్ పాల్ రెడ్డి, ఉమేష్ రె ఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాగా.. ఇందులోంచి పోస్టర్స్, టీజర్, సాంగ్ రిలీజ్ అయి ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘బ్యూటీ’ అప్డేట్ రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో హీరోహీరోయిన్ స్కూటీపై కుక్కను బ్యాగ్‌లో పట్టుకుని కాలేజ్‌కు వెళ్తున్న పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 13న రాబోతున్నట్లు వెల్లడించారు. కాలంతో ప్రతిధ్వనించే ప్రేమకథ మీ ముందుకు రాబోతుంది. చూసి ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది.






