నా ప్రమేయం లేకుండా చాలా జరుగుతున్నాయి.. నన్ను ఎంత తొక్కినా పర్లేదంటూ ఎమోషనల్ అయిన రాజ్ తరుణ్

by Mallepaka Hamsa |

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ యంగ్ రాజ్ తరుణ్(Raj Tarun) పేరు మార్మోగిపోతోంది.

నా ప్రమేయం లేకుండా చాలా జరుగుతున్నాయి.. నన్ను ఎంత తొక్కినా పర్లేదంటూ ఎమోషనల్ అయిన రాజ్ తరుణ్
X

దిశ, సినిమా: గత కొద్ది రోజులుగా టాలీవుడ్ యంగ్ రాజ్ తరుణ్(Raj Tarun) పేరు మార్మోగిపోతోంది. ఆయన లావణ్య అనే అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఆమె రాజ్ తరుణ్‌పై కేసు పెట్టడంతో పాటు తనకు కడుపు తీయించాడని చంపాలని చూస్తున్నాడని కామెంట్స్ చేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. కొద్ది రోజుల పాటు వీరిద్దరి వ్యవహారం సోషల్ మీడియాలో దుమారం రేపింది. అయినప్పటికీ రాజ్ తరుణ్ తన తప్పు లేదని చెప్పాడు. అలాగే ఆయన తల్లిదండ్రులు కూడా ఈ వ్యవహారంలోకి ఎంట్రీ ఇచ్చారు.

తమ ఇల్లును లావణ్య లాక్కుందని ధర్నా కూడా చేసిన వీడియోలు దుమారం రేపాయి. కొద్ది కాలానికి ఈ వివాదం కాస్త సర్ధుమనగడంతో రాజ్ తరుణ్ వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ నటిస్తున్న చిత్రాల్లో ‘పాంచ్ మినార్’ (Panch Minar)ఒకటి. రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్‌లో రాశి సింగ్(Rashi Singh) హీరోయిన్ గా నటిస్తున్నారు. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఈ ఈవెంట్‌లో పాల్గొన్న రాజ్ తరుణ్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ‘‘నన్ను చాలామంది మాట్లాడు మాట్లాడు అంటే నాకు ఇష్టం లేదని చెప్పాను. నా దగ్గర సమాధానం లేకనో ధైర్యం లేకనో కాదు.. వెనక్కి తిరిగి చూడటం ఇష్టం లేక మాట్లాడానికి ఇష్టపడలేదు. నా ప్రమేయం లేకుండా నా వెనకాల చాలా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేను చేయగలిగిందల్లా అటు ఇటు చూడకుండా ముందు వెళ్లడమే. అక్కడక్కడ తొక్కే వాళ్ళు ఉంటారు. ఎంత తొక్కిన పర్లేదు.. నేను స్ప్రింగ్ లాంటోడ్ని నాకు ఓకే’’ అని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story