- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nani - Sujeeth: కొంచెం ప్రేమ మరికొంత పిచ్చి.. టైటిల్‌తోనే అంచనాలను పెంచేసిన మేకర్స్
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాని - సుజిత్ (Sujith) ప్రాజెక్ట్ టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేశారు.

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని(nani) పుట్టినరోజు వేడుకలు సోషల్ మీడియాలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమాల నుంచి వరుస అప్‌డేట్స్ వస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాని - సుజిత్ (Sujith) ప్రాజెక్ట్ టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ (Bloody Romeo) అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా నాని తన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘‘కొంచెం యాక్షన్, కొంచెం ఫన్, కొంత పిచ్చి, మరికొంత ప్రేమతో మీ ముందుకు రాబోతున్నాం’’ అంటూ సినిమా థీమ్‌పై హింట్ ఇచ్చారు.
'గ్యాంగ్ లీడర్' తర్వాత నాని మళ్ళీ ఫన్ అండ్ యాక్షన్ మిక్స్డ్ రోల్‌లో కనిపించబోతున్నారని ఈ టైటిల్ చూస్తుంటే అర్థమవుతోంది. టైటిల్‌తో పాటు విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ డిజైన్ చాలా విభిన్నంగా ఉంది. పోస్టర్ మధ్యలో మూడు గులాబీ పువ్వులు ఉంటే, వాటి వెనుక రెండు గన్స్ ఉన్నాయి. వాటి చుట్టూరా కత్తులతో కూడిన డిజైన్ సినిమాలోని ఇంటెన్సిటీని తెలియజేస్తోంది. ప్రేమకథకు యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ను జత చేసి సుజిత్ తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది. ఇక ఈ సినిమాను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్, యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి.
- Tags
- nani
- Bloody Romeo






