జీవితకాల కోరిక నెరవేరింది.. మంత్రీస్ మహాలక్ష్మి వచ్చేసిందంటూ శివజ్యోతి ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-15 04:00:44  IST  )

గంగులు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన అదృష్టవంతుడైన తండ్రి.

జీవితకాల కోరిక నెరవేరింది.. మంత్రీస్ మహాలక్ష్మి వచ్చేసిందంటూ శివజ్యోతి ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: తెలంగాణ యాసతో, తనదైన మాటతీరుతో బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి, ఫిబ్రవరి 12న తన భర్త గంగులు పుట్టినరోజు నాడే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆ రోజు కేవలం డెలివరీ అప్‌డేట్ మాత్రమే ఇచ్చి, పాప పుట్టిందా లేదా బాబు పుట్టాడా అనే విషయాన్ని మాత్రం సస్పెన్స్‌లో పెట్టింది. దీంతో అభిమానులంతా ఆ ఆసక్తికరమైన వార్త కోసం ఎదురుచూశారు. నిత్యం సోషల్ మీడియాలొ అడగటం మొదలెట్టారు. ఈనేపథ్యంలో..తాజాగా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా శివజ్యోతి తన భర్తతో కలిసి ఒక క్యూట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. "మంత్రీస్ మహాలక్ష్మి.. నా వెంకటేశ్వర స్వామి ప్రసాదం. నా స్వామి ఇచ్చిన మహాలక్ష్మి. నా జీవితంలో అత్యంత విలువైన పుట్టినరోజు బహుమతిని భగవంతుడు ఇచ్చాడు. బిడ్డను కనడం నాకు ఒక పెద్ద కల, అందులోనూ ఆడపిల్ల కావాలని కోరుకోవడం నా జీవితకాల కోరిక. బహుశా దేవుడు నా సహనాన్ని పరీక్షించి ఉండవచ్చు.. కానీ సరైన సమయంలో నా కోరికను నెరవేర్చాడు. మొదటి నెల నుండి నా మనసు ఆడపిల్ల కావాలని బలంగా కోరుకుంది. మా గడువు తేదీకి రెండు రోజుల ముందు నాకు ఒక గట్టి నమ్మకం కలిగింది - ఖచ్చితంగా మాకు ఆడపిల్ల పుట్టబోతోందని. నేడు మీ అందరి ఆశీర్వాదాలతో ఆ మహాలక్ష్మి మా ఇంట అడుగుపెట్టింది’’ అని చెప్పింది.

ప్రపంచంలోనే అదృష్టవంతుడు గంగులు:

తన భర్త గంగులు గురించి చెబుతూ.. "గంగులు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన అదృష్టవంతుడైన తండ్రి. ఆయన మంచితనం వల్లే మాకు ఆడపిల్ల పుట్టిందని నేను నమ్ముతున్నాను. నేను, నా బిడ్డ ఇద్దరం క్షేమంగా ఉన్నాము" అని పేర్కొన్నారు. పదేళ్ల నిరీక్షణ తర్వాత ఇద్దరూ ముద్దుల పాపతో దిగిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. శివజ్యోతి పోస్ట్‌ చూసిన బుల్లితెర సెలబ్రిటీలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. "మా ఇంటి సావిత్రికి మహాలక్ష్మి పుట్టింది, కంగ్రాచ్యులేషన్స్ అక్కా" అంటూ నెటిజన్లు వేల సంఖ్యలో మెసేజ్‌లు చేస్తున్నారు. పదేళ్ల నిరీక్షణ ఫలించి, వారు కోరుకున్నట్టే ఆడపిల్ల పుట్టడంతో అంతా ఆ జంటకు అభినందనలు తెలుపుతున్నారు.

Next Story