మాస్ కా దాస్‌ విశ్వక్‌సేన్‌కు జోడీగా కన్నడ బ్యూటీ ఫిక్స్.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్(Vishwak Sen) నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో ‘లెగసీ’ (Legacy)ఒకటి.

మాస్ కా దాస్‌ విశ్వక్‌సేన్‌కు జోడీగా కన్నడ బ్యూటీ ఫిక్స్.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్(Vishwak Sen) నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో ‘లెగసీ’ (Legacy)ఒకటి. ఈ మూవీ అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుడైన తన తండ్రి వారసత్వాన్ని అనివార్యంగా మోయవలసి వచ్చే సిద్ధార్థ్ అనే యువకుడి కథగా రాబోతున్నట్లు సమాచారం. అధికార పీఠాన్ని అధిరోహించేందుకు రక్తం ఎలా ఏరులైపారుతుంది? ఎంతమంది జీవితాలను మట్టు పెట్టి అందలం ఎక్కుతున్నారు? అనే స్టోరీతో రాబోతున్నట్లు టాక్. ఈ సినిమా సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో తెరకెక్కనుంది. కలాహీ మీడియా బ్యానర్‌పై దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రావు రమేష్, సచిన్ ఖేదేకర్, మురళి మోహన్, కేకే మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కాగా.. న్యూ ఇయర్ సందర్భంగా మూవీ మేకర్స్ పవర్ ఫుల్ టీజర్‌తో అంచనాలను పెంచేశారు.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానున్నట్లు టాక్. తాజాగా, ఈ సినిమాలో ఓ కన్నడ బ్యూటీ నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ చేశారు. నేడు ఏక్తా రాథోడ్ (Ekta Rathod)పుట్టిన రోజు కావడంతో విషెస్ తెలుపుతూ.. విశ్వక్ సేన్‌కు జోడీగా నటించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా లంగా ఓణీలో సంప్రదాయ లుక్‌లో భుజంపై రామచిలుకతో మెస్మరైజింగ్ లుక్‌లో కనిపించగా.. పక్కనే విశ్వక్‌సేన్ నవ్వులు చిందిస్తున్నట్లు ఉన్న లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాతో ఏక్తా రాథోడ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. పలు కన్నడ చిత్రాల్లో నటించిన ఈ భామ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ మాస్ హీరోతో రొమాన్స్ చేయనుంది.

link

Next Story