చిరంజీవి సినిమా సెట్‌లో భారీ అగ్నిప్రమాదం..!

by Disha Web Desk 6 |
చిరంజీవి సినిమా సెట్‌లో భారీ అగ్నిప్రమాదం..!
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి సినిమా సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గత ఏడాది కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘ఆచార్య’ సినిమా కోసంహైదరాబాద్‌లోని కోకపేట లేక్ సమీపంలో ధర్మస్థలి టెంపుల్‌ను ఏర్పాటు చేసిన సెట్‌ను అలాగే ఉంచారు. తాజాగా, సోమవారం రాత్రి లేక్ సమీపంలో ఉన్న సెట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అది గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు.

దీంతో ఫైర్ ఇంజన్‌ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే మంటలు చెలరేగడంతో సెట్ అంతా కాలిపోయింది. దీంతో కోట్ల విలువైన సెట్ క్షణాల్లో బుగ్గిపాలైపోయింది. సెట్ లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సిగరెట్ తాగి పడేయడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం దీనిపై ఆచార్య టీమ్ ఎవరూ స్పందించలేదు.



Next Story

Most Viewed