- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిట్ కాంబో రిపీట్.. ‘భోగి’ నుంచి కందుల సులోచన రాణి పోస్టర్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్
తలపై బుట్టలో మోదుగు ఆకుల కట్టలు, భుజానికి వేలాడుతున్న మరికొన్ని ఆకులు, చేతిలో క్యారేజీ పట్టుకుని వెళ్తున్న అనుపమ లుక్ అదిరిపోయింది.

దిశ, సినిమా: టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. శ్రీ సత్య సాయి బ్యానర్‌పై కే.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చి మేకర్స్ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశారు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరదించారు. ఒకప్పుడు ‘శతమానం భవతి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో మెప్పించిన శర్వానంద్ - అనుపమ పరమేశ్వరన్ జోడి, ఇప్పుడు ‘భోగి’ సినిమాతో మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. అనుపమ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ, ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ సినిమాలో ‘కందుల సులోచనా రాణి’ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు వెల్లడించారు.
విడుదలైన పోస్టర్‌లో అనుపమ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. రింగుల జుట్టు సుందరి ఈసారి పక్కా పల్లెటూరి అమ్మాయిగా మారిపోయింది. తలపై బుట్టలో మోదుగు ఆకుల కట్టలు, భుజానికి వేలాడుతున్న మరికొన్ని ఆకులు, చేతిలో క్యారేజీ పట్టుకుని వెళ్తున్న అనుపమ లుక్ అదిరిపోయింది. కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా, ఎండలో నడుచుకుంటూ వెళ్తున్న ఆమె రూపం ప్రకృతి బిడ్డలా కనిపిస్తోంది. "కందుల సులోచన రాణిని కలవండి.. ప్రకృతి బిడ్డ.. గంగా ఇల్లు కందుల గౌరవం.. భోగి ఆత్మ" అంటూ ఈ పాత్రకు ఇచ్చిన క్యాప్షన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రానికి మాస్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, అనుపమతో పాటు డింపుల్ హయాతి కూడా కీలక పాత్రలో నటించనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాను ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. గత ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనుపమ, ‘భోగి’తో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. శర్వానంద్ మాస్ లుక్, అనుపమ పల్లెటూరి అందం తోడవ్వడంతో ‘భోగి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయం అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.






