- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. స్టార్ నటుడు కన్నుమూత
గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్సోతూ అభిమానులను విషాదంలోకి నెట్టేస్తున్నారు. ఇండియన్ సెలబ్రిటీలే కాకుండా హాలీవుడ్ నటులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు అనారోగ్య సమస్యలతో చనిపోతే.. మరికొందరు ఏవో కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా, హాలీవుడ్ హీరో పీటర్ హెన్రీ స్క్రోడర్(Peter Henry Schroeder) ఫ్లోరిడాలో కన్నుమూశారు. హెన్రీ మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన ఆరోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, హెన్రీ కొరియా యుద్ధంలో సైనికుడిగా కూడా సేవలు అందించినట్లు సమాచారం. ఇక ఆయన అంత్యక్రియలు లాస్ ఏంజిల్స్‌లోని సైనిక లాంఛనాలతో అత్యంత గౌరవప్రదంగా జరిగినట్లు తెలుస్తోంది.






