- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రముఖ హీరోయిన్ మృతి
గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు అనారోగ్య సమస్యలతో మరణిస్తే.. మరికొందరు ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకుంటూ అందరినీ ఎంతో దిగ్భ్రాంతికి గురి చేస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో దిగ్గజ నటుడు కోట శ్రీనివాస రావు(Kota Srinivasa Rao) మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణవార్త మర్చిపోక ముందే సీనియర్ నటి సరోజా దేవి(Saroja Devi) కన్నుమూశారు. ఇక వీరి మరణవార్త నుంచి బయటపడకముందే యంగ్ హీరోయిన్ క్యాన్సర్‌తో చనిపోయింది. దక్షిణ కొరియా నటి కాంగ్ సియో హా(Kang Seo Ha) 31 సంవత్సరాల వయసులో క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయింది.
కీమో థెరపీ రెండవ రౌండ్ చేయించుకుంటుండగా.. జూలై 13న మధ్యాహ్నం మరణించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కాంగ్ సియో చివరగా ‘IntheNet’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ అమ్మడు హా కె-డ్రామాస్ స్కూల్ గర్ల్ డిటెక్టివ్స్, అసెంబ్లీ, ఫ్లవర్ ఆఫ్ ప్రిజన్, ఫస్ట్ లవ్ ఎగైన వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.






