ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు మృతితో గుండెలు అవిసేలా ఏడుస్తున్న కూతురు (వీడియో)

by Mallepaka Hamsa |

గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలో తీవ్ర విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. నిత్యం ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు మృతితో గుండెలు అవిసేలా ఏడుస్తున్న కూతురు (వీడియో)
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలో తీవ్ర విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. నిత్యం ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఒక విషాదాన్ని మరిచిపోకముందే మరొకరు మృతి చెందుతున్నారు. ఇక కొంతమంది అనారోగ్య సమస్యలతో చనిపోతే.. మరికొందరు మాత్రం ఊహించని విధంగా లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. తాజాగా, ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్ నటుడు రోబో శంకర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత రెండు రోజుల క్రితం ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న రోబో శంకర్ (Robo Shankar)సడెన్‌గా స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో చిత్రబృందం వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో రెండు రోజుల నుంచి చికిత్స తీసుకుంటున్న రోబో శంకర్ గురువారం రాత్రి మరణించారు.

జీర్ణాశయంలో రక్తస్రావం అంతర్గతంగా అవయవాలు చెడిపోవడంతో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. ఇక రోబో శంకర్ హఠాన్మరణంతో కోలీవుడ్‌లో సంతాపం నెలకొంది. సెలబ్రిటీలంతా కలిసి ఆయన ఇంటికి చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. రోబో శంకర్ ఒక్కగానొక్క కూతురు ఇంద్రజ తండ్రి శవం వద్ద గుండెలు అవిసేలా ఏడుస్తూ సెలబ్రిటీలను కన్నీరు పెట్టేలా చేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయనకు భార్య, ఓ కూతురు ఉంది. ఇంద్రజ కూడా నటి అన్న విషయం తెలిసిందే. ఆమె విజయ్ ‘బిగిల్’ సినిమాలో గుండమ్మ గా నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

link

Next Story