ఆషిక రంగనాథ్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆమె మరణానికి లైంగిక వేధింపులే కారణమా!

by Mallepaka Hamsa |

టాలీవుడ్ హీరోయిన ఆషిక రంగనాథ్(Ashika Ranganath)ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

ఆషిక రంగనాథ్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆమె మరణానికి లైంగిక వేధింపులే కారణమా!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన ఆషిక రంగనాథ్(Ashika Ranganath)ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె మేనమామ కూతురు అచల్ (Achal)ఆత్మహత్య చేసుకుని నవంబర్ 22న మరణించగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరబోతున్న అచల్‌కు తన దూరపు బంధువైన మయాంక్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటానని కూడా అచల్ డిసైడ్ అయింది. కానీ మయాంక్(Mayank) మాత్రం తనను శారీరకంగా మానసికంగా వేధించేవాడని తెలుస్తోంది. మాదకద్రవ్యాలకు బానిసైన అతను పలువురు యువతులతో కూడా ఎఫైర్ పెట్టుకోగా.. అచల్‌ను లైంగికంగా వేధించడంతో పాటు పలుమార్లు చేయి చేసుకున్నాడట.

ఇక అచల్‌‌కు మయాంక్ ఎఫైర్స్ తెలియడంతో తనను మోసం చేసినట్లు గ్రహించిన ఆమె ఎవరికీ చెప్పుకోలేక అతడిని మర్చిపోలేక తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుంది. అచల్ తల్లిదండ్రులు మయాంక్‌తో పాటు అతని తల్లి మైనాపై కూడా పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటన జరిగి చాలా రోజులే అవుతున్నప్పటికీ పోలీసులు మాత్రం తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనతో ఆషిక రంగనాథ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కానీ ఈ విషయంపై మాత్రం ఆమె ఎక్కడా అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం.

Next Story