వేణు యెల్దండి ‘ఎల్లమ్మ’లో సరికొత్త ట్విస్ట్.. సైలెంట్‌గా షూటింగ్ పూర్తి చేస్తున్న యంగ్ బ్యూటీ!

by Mallepaka Hamsa |

ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో టాలెంటెడ్ బ్యూటీ సురభి ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

వేణు యెల్దండి ‘ఎల్లమ్మ’లో సరికొత్త ట్విస్ట్.. సైలెంట్‌గా షూటింగ్ పూర్తి చేస్తున్న యంగ్ బ్యూటీ!
X

దిశ, సినిమా: ‘బలగం’ సినిమాతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న వేణు యెల్దండి దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’. ఈ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కాబోతున్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఎల్లమ్మ దేవతను ఆరాధించే గ్రామీణ జానపద కళాకారుల బృందం, వారి జీవన పోరాటం, వారి ఆత్మగౌరవం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని సమాచారం. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ సంస్కృతి, ఇక్కడి జానపద కళల వైభవం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవబోతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇప్పటివరకు చిత్రబృందం అధికారిక ప్రకటన చేయలేదు. మొదట్లో సాయి పల్లవి, కీర్తి సురేష్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో టాలెంటెడ్ బ్యూటీ సురభి ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సైలెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనడమే కాకుండా, తన పాత్రకు సంబంధించిన షూట్‌ను కూడా దాదాపు కంప్లీట్ చేసినట్లు టాక్. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో సురభి పాత్ర ఎంతో విభిన్నంగా, ఎమోషనల్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. నటి సురభితో పాటుగా, వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ కూడా ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్‌లో భాగం అయినట్లు తెలుస్తోంది. ఆయన పాత్ర ఈ సినిమా కథను మలుపు తిప్పే విధంగా ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటుడు తోడవ్వడంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. అయితే దీనిపై మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Next Story