- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan : పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం
పవర్ స్టార్ కల్యాణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోన్న ‘హరిహరి వీరమల్లు’ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ కల్యాణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోన్న ‘హరిహరి వీరమల్లు’ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని దుండిగల్ పరిధిలోని బౌరంపెట్‌లో అర్ధరాత్రి షూటింగ్ జరుగుతుండగా మంటలు అలుముకున్నాయి. అది గమనించిన చిత్ర యూనిట్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. గతంలో వర్షానికి సెట్ కూలగా.. ఇప్పుడు దానికి మరమత్తులు చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎవరికి ఏం జరగలేదని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Read More... పవన్ కల్యాణ్ ‘BRO’ నుంచి డబుల్ ట్రీట్
Next Story






